విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా యాత్ర ముగిసింది. అమెరికా నుంచి తిరిగొచ్చిన జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. తొలుత హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సీఎంను చూసేందుకు వెల్‌కమ్ ప్లకార్టులతో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ఈ నెల 15వ తేదీ రాత్రి సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లారు.