గుంటూరు : డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పెద్డల్లుడు. సీనియర్ పొలిటీషియన్. మొన్న ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడాయన తీరు పార్టీ అధినేతకు నచ్చట్లేదు. దగ్గుబాటి గురించి జగన్ స్పెషల్‌గా ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. ఇంటెలిజన్స్ వారితో పరుచూరులో సర్వే చేయిస్తున్నారని సమచారం. అసలు దగ్గుబాటిపై జగన్ ఎందుకంత విముఖంగా ఉన్నారు? ప్రస్తుతం ఇదే ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్.
బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పురంధేశ్వరి వైసీపీ సర్కార్‌పై ఇటీవల దూకుడుగా చేస్తున్న వ్యాఖ్యలు జగన్‌కు చిరాకు తెప్పించాయని అంటున్నారు. అందుకే దగ్గుబాటిపై జగన్ స్పెషల్ సర్వే చేయిస్తున్నారనే ప్రచారం రాజకీయ చర్చకు దారితీస్తోంది.
అసలు దగ్గుబాటి పరుచూరులో ఏమి చేస్తున్నారు..? వ్యక్తి గత అజెండా ఏదైనా అమలు చేస్తున్నారా…? ఇంటెలిజన్స్ ఆరాకు అదేకారణమా..? అనే చర్చ నేతల్లో జరుగుతోంది. దగ్గుబాటి పరుచూరుకు పెద్దగా రావడం లేదు. మండల స్థాయిలో స్థానిక లీడర్లకు బాధ్యతలు అప్పగించారు. వారే ఆయా మండలాల్లో పార్టీ వ్యవహారం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటిని పరుచూరు ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి గత ఎన్నికల్లో పార్టీకి పనిచేసిన గొట్టిపాటి భరత్‌కు పగ్గాలు అప్పగించవచ్చని తెలుస్తోంది. అందుకోసమే ఒక సర్వే చేయించి ఆ రిపోర్టు ఆధారంగా ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారని చెబుతున్నారు.