ఏపీ సీఎం జగన్ తన సొంత పత్రిక సాక్షిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాక్షిలో వచ్చిన కథనం తప్పంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్నబియ్యంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగన్ ఈ కామెంట్ చేయటం చర్చనీయాంశం అవుతోంది.
టీడీపీ నేతలు సాక్షిలో కూడా సన్నిబియ్యం అంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించారని అనగానే… సీఎం వెంటనే స్పందిస్తూ సాక్షి రాసిన కథనం తప్పని, నాణ్యమైన బియ్యానికి సన్నబియ్యానికి తేడా తెలియకుండా వారు తికమకపడ్డారని తెలిపారు. కావాలంటే ఆ రోజు మిగతా పేపర్లు చూస్తే తెలుస్తుందని , మీకూ కూడా నాలెడ్జ్ పెరుగుతుందంటూ సెటైర్స్ వేశారు.
మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నేరవేర్చటం మా బాధ్యత అని, వచ్చే ఏప్రిల్ నుండి నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తామన్నారు.