ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హుటా హుటిన ఢిల్లీకి పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. తన పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని విషయంపై జగన్ ప్రధాన మంత్రితో చర్చించే అవకాశాలున్నాయి. ఎలాంటి ముందస్తు ప్లాన్ లేకుండా సీఎం సడెన్ టూర్ ఏమై ఉంటుందనేది చర్చానీయాంశమైంది.