ఆరునెలల వై.ఎస్.జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు నవంబర్ నెల జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేకపోవడం. ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు డిసెంబర్ ఒకటిన చెల్లించాల్సిన నవంబర్ నెల జీతం కోసం అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతాల కోసం మొత్తం రూ.2700 కోట్లు కాగా…రిజర్వ్ బ్యాంక్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ద్వారా రూ.1500, ఆర్.బి.ఐ. వేస్ అండ్ మీన్స్ సౌకర్యం వినియోగించుకొని రూ.1200 కోట్లు సమకూర్చుకున్నారు.
తనకు ఓట్లు రాల్చిన నవరత్నాలు పథకానికి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం అప్పులతో నడుస్తుండగా…డిసెంబర్ తర్వాత అప్పులు దొరికే పరిస్థితి కూడా లేదు. అందుకే ఏప్రిల్ నుంచి డిసెంబర్ లోపు రూ.29000 కోట్లు రుణం తెచ్చుకోవడానికి కేంద్రం జగన్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే రూ.28000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇక జనవరి నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నా, వేరే ఖర్చు చేయాలన్నా ప్రభుత్వ భూములు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదు.