తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
కాగా టిడిపి కార్యకర్తలు సినీ రాజకీయ ప్రముఖులు చంద్ర బాబు త్వరగా కోలుకోవాలని ట్వీట్ లు చేస్తున్నారు. అయితే ఇదే విషయమై జగన్ కూడా ట్వీట్ చేశారు.
చంద్రబాబు గారు త్వరగా కోలుకొని,ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి అంటూ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.