జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అదే సమయంలో టీడీపీ మాజీ మంత్రి పి. నారాయణకు ఊరట లభించింది. పేపర్ లీకేజ్ కేసులో హైకోర్టు రిమాండ్ అర్డర్ పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
నారాయణ తరపున కోర్టులో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూద్రా, గుంటూరు ప్రమోద్, గుంటూరు ప్రేరణ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు రవీంద్రభట్, దీపాంకర్ దత్తా నేతృత్వలోని ధర్మాసనం కేసులు విచారించింది. గతంలో నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు.
హైకోర్టు బెయిల్ రద్దు చేసి నారాయణను సరెండర్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు నేడు స్టే ఇచ్చింది. గత ఏడది ఏప్రిల్ మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సందర్భంగా ప్రశ్నా పత్రాలు లీక్ కావడం సంచనలం సృష్టించాయి. ఈకేసులో నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు చిత్తూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్ ను తిరస్కరించడంతో నారాయణ బెయిల్ పై విడుదలయ్యారు.
దీనిపై పోలీసులు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణానంతరం సెషన్స్ కోర్టు..నారాయణకు బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసి ఆయన కోర్టులో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.