యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమా తో రీఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. ముందు వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా ఉన్న జగపతి బాబు లెజెండ్ సినిమాతో స్టార్ విలన్ గా మారిపోయారు. ప్రస్తుతం జగపతి బాబు ఎఫ్ సి యు కె చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జగపతిబాబు ఆసక్తికరమైన పోస్ట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జీసస్ రూపంలో జగపతిబాబు ఉన్న ఫోటో అది. అయితే దాన్ని చూసిన నెటిజన్లు జనులు జీసస్ ని చూసినట్టే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటో ఎందుకు జగ్గూభాయ్ పోస్ట్ చేశాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు.
— Jaggu Bhai (@IamJagguBhai) January 25, 2021