జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే
మోడీ ప్రధాని అయ్యాక దేశంలో రాజకీయ విలువలు పడిపోయాయి. ప్రజా సమస్యలపై స్పందిస్తే అధికార దుర్వినియోగంతో మోడీ, అమిత్ షా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారు.
బీజేపీ నాయకులు గ్రేటర్ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని అడ్డుపెట్టుకొని రెండు నుంచి 47 స్థానాలు గెలుచుకున్నారు. దేశంలో రాముడిని అడ్డుపెట్టుకొని విజయం సాధించారు.
రాహుల్ గాంధీకి డబ్బులు కావాలంటే పత్రికా డబ్బులు అవసరం లేదు.. కార్యకర్తలు ఇస్తారు. నాయకులను బ్లాక్ మెయిల్ చేయాలని.. బిజెపి ఐటీ, సీబీఐ..ఈడీలను వాడుకుంటోంది.
ప్రధాని మోడీ పేదల అకౌంట్లలో 15 లక్షలు జమ చేస్తామని ఎందుకు వేయలేదు..? బిజెపి నేతల అసంబద్ధ విధానాలు, పోకడపై ఎక్కడికక్కడ నిలదీస్తాం.