కళ్లు ఉండి చూడలేకపోతున్న గుడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ది అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఆకలిచావులు, ఆత్మహత్యలు ఉండవన్నారు… కానీ రాష్ట్రం వచ్చినా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వానికి హైకోర్టు ఎన్ని చురకలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, టీఎన్జీవో టీజీవో నేతలు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.