పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసమ్మతి గళం వినిపించారు. రేవంత్ రెడ్డి తన పర్యటన సందర్భంగా తమకు కనీస సమాచారం ఇవ్వటం లేదని, తన సొంత జిల్లా సంగారెడ్డికి వస్తూ తనకు సమాచారం ఇవ్వకపోవటం ఏంటీ అని ప్రశ్నించారు.
కనీస ప్రోటోకాల్ లేదని, జహీరాబాద్ లో పర్యటిస్తూ స్థానిక నేత గీతారెడ్డికి కూడా సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీయా… ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అంటూ మండిపడ్డారు. కనీస చర్చ లేకుండా 2 నెలల కార్యాచరణ ఇచ్చారని, నాతో విభేదాలున్నట్లు రేవంత్ రెడ్డి ప్రచారం చేయదల్చుకున్నారా అని జగ్గారెడ్డి పార్టీ ముఖ్యనేతల మధ్య ఆవేశంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
జహీరాబాద్ లో మధ్యాహ్నం 2గంటలకు అజారుద్దీన్ వర్సెస్ రేవంత్ రెడ్డి టీంలు క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాయి.