తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి పేర్లు బలంగా వినిపిస్తున్న దశలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ రేసులో ఉన్నానని గత కొంతకాలంగా బలంగా వాదిస్తున్న ఆయన, తన పేరును రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వరకు చేర్చకపోవటంపై రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇంచార్జి మాణికం ఠాగూర్ పై విమర్శలు గుప్పించారు.
2017లో రాహుల్ గాంధీ మీటింగ్ కోసం కోట్లు ఖర్చు చేశానని, ఇలాంటి విషయాలేవీ తెలుసుకోకుండా కొత్త ఇంచార్జ్ వ్యవహరించారన్నారు. అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తానని వ్యాఖ్యానిస్తూనే… ఏకంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ పై విమర్శలు గుప్పించటం పార్టీలో హాట్ టాపిక్ అవుతుంది.