ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇది తిరుగులేని గెలుపు.. అఖండ విజయం అంటూ గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన ఛాలెంజ్ ని మాత్రం అందుకోలేకపోయారు. ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు.
మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున యాదవరెడ్డి బరిలో నిలవగా.. కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి భార్య నిర్మలను పోటీలో నిలబెట్టింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారు జగ్గారెడ్డి. తాజాగా జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ కు 238 ఓట్లు వచ్చాయి. ఆయన ఛాలెంజ్ చేసిన దానికంటే కాంగ్రెస్ కు 8 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
జిల్లా నాయకులను సమన్వయం చేసుకుంటూ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఓట్లన్నీ పక్కాగా పడేలా చూసుకున్నారు జగ్గారెడ్డి. అందుకే ఆయన ఛాలెంజ్ చేసిన దానికంటే 8 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లు దక్కాయి.