పట్టా భూమి కోసం అధికారులకు లంచం ఇచ్చినా… తన పట్టా పుస్తకాలను ఇవ్వటం లేదంటూ ఓ రైతు జగిత్యాల కలెక్టర్‌కు ప్రజావాణిలో మొరపెట్టుకున్నాడు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన అధికారులు నర్సయ్య అనే రైతు పట్టా పేపర్లను సిద్ధం చేశారు. అదే ప్రజావాణిలో… ఆ పట్టా పుస్తకంతో పాటు గతంలో తాను ఇచ్చిన 10వేల రూపాయలను కూడా కలెక్టర్ స్వయంగా తిరిగిచ్చేశాడు. దీంతో ఆ రైతు ఆనందంతో కలెక్టర్ శరత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
లంచం తీసుకున్నందుకు ఇద్దరు అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు.