“రాముడు మన దేశంలో జన్మించడం మన అదృష్టం…అయోధ్యలో ఆలయ నిర్మాణం మనకాలంలో జరగడం ఇంకా అదృష్టం. అందుకే మనమంతా స్వచ్చమైన మనస్సుతో అయోధ్యలో ఒక గొప్ప రామ మందిరాన్ని నిర్మించుకుందాం…దీని కోసం మీరు మీకు తోచినంత విరాళమివ్వండి” అని పిలుపునివ్వడమే కాక విరాళాల సేకరణను ప్రారంభించింది విజయవాడకు చెందిన జహెరా బేగం.!
తహెరా ట్రస్ట్ ను నిర్వహిస్తున్న జహెరా… రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు కోరడంతో … సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆమెపై చర్చ ప్రారంభమైంది. ఒక ముస్లీం మహిళ రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వమని ప్రజలను ప్రోత్సహించడమే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అంటున్నారు.!
10 సంవత్సరాలుగా గ్రామాల్లో సోషల్ సర్వీస్ చేస్తున్న జహెరా….. ముస్లీంల మసీదులు, ఇద్గాలు మరియు స్మశానవాటికల కోసం హిందువులు ఏవిధంగా అయితే తమ భూములను అప్పగించి సహాయం చేశారో…ఇప్పుడు మనం కూడా మన విశ్వాసాన్ని చూపించే తరుణమొచ్చిందని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముస్లీంలను ఉద్దేశించి అన్నారు జహెరా!