బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తన అభిమానులకు ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటుంది. నిజానికి శ్రీదేవిలా జాన్వీ కూడా చక్కగా డ్యాన్స్ చేయగలదు. అందులో భాగంగానే పలు పాటలకు ఆమె ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఇలాగే మరొక వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. ఆ వీడియోకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.
జాన్వీ కపూర్ ఎల్లో కలర్ సల్వార్ కుర్తా ధరించి.. కన్హా మానే నా అనే పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. 2017లో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నెకర్‌లు నటించిన శుభ్ మంగళ్ సావధాన్ అనే సినిమాలోనిది ఆ పాట. ఆ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాంటి పాటలకు మళ్లీ మళ్లీ డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలను షేర్ చేయాలని వారు ఆమెను సోషల్ మీడియాలో కోరారు.
ఇక ఆ పాటలో జాన్వీ సోదరి ఖుషి కపూర్‌ను కూడా చూడవచ్చు. కానీ ఆమె జాన్వీని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీంతో జాన్వీ ఆమె గురించి ఆ పోస్టులో కామెంట్ పెట్టింది. నా డ్యాన్స్ పట్ల నా సోదరి కన్నా మీరే ఎక్కువగా ఆనందం చెంది ఉంటారు.. అని జాన్వీ కామెంట్ పెట్టింది. దీంతో అభిమానులు ఆమె వీడియోకు తెగ లైక్‌లు కొడుతూ షేర్ చేస్తున్నారు.
Advertisements
కాగా జాన్వీ కపూర్ చివరిసారిగి గుంజన్ సక్సేనా అనే మూవీలో నటించి అలరించింది. ఆ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో ఆగస్టు 12న విడుదలై పాజిటివ్ రివ్యూలను సంపాదించింది. 2018లో ధడక్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఘోస్ట్ స్టోరీస్‌లో నటిస్తోంది. అలాగే కరణ్ జోహార్ తీస్తున్న తక్త్ మూవీ, మరో హార్రర్ కామెడీ మూవీ రూహీ అఫ్జా, దోస్తానా 2లో రాజ్ కుమార్ రావుకు అపోజిట్‌గా నటిస్తోంది. ఆమె సోదరి ఖుషీ కపూర్ న్యూయార్క్ ఫిలిం అకాడమీలో విద్యనభ్యసిస్తోంది. జాన్వీతోపాటు అప్పుడప్పుడు పలు పోస్టుల్లో ఖుషి కపూర్ కూడా కనిపిస్తుంటుంది.