ఎట్టకేలకు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. నిన్న గ్రాండ్ గా ముంబై పూరి , విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్ ‘జనగణమన’ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. పూరి డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.
శ్రీదేవి కూతురు జాన్విని తెలుగులో పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకులు ట్రై చేస్తున్నారు. అందులో పూరి కూడా ఉన్నాడు. ఇటివలే జాన్వి సౌత్ లో కూడా సినిమా చేస్తుందని , తెలుగులో కూడా తన లాంచ్ త్వరలోనే ఉంటుందని చెప్పుకున్నాడు ఆమె తండ్రి బోనీ కపూర్. ఇక జనగణమన లో హీరోయిన్ గా జాన్వి అయితే బాగుంటుందని ఇటివలే పూరి, బోనీని సంప్రదించారట.
జాన్వి లాంచ్ కి ఈ పాన్ ఇండియా సినిమా అయితేనే పెర్ఫెక్ట్ అని కూడా భావిస్తున్నారట. జాన్వి సినిమాకు సైన్ చేసిన వెంటనే మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.
శ్రీకర స్టూడియోస్ పై వంశీ పడిపల్లి , పూరి కనెక్ట్స్ పై ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 3న రిలీజ్ అవ్వనుంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.