టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జై భీమ్. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. డైరెక్ట్ గా ఈ చిత్రం గత ఏడాది ఓ టి టి లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వేదిక రిలీజైన ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది.
గతంలో సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రం కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ రెండు చిత్రాలు కూడా ఓటిటి లో వరుసగా రిలీజ్ కావడం విశేషం.
సూర్య వరుస చిత్రాలు ఆస్కార్స్ కి ఎంపిక అవ్వడం పట్ల అభిమానులు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 276 చిత్రాలు 94 వ అకాడమీ అవార్డు నామినేషన్ లో ఉండగా 2 డి ఎంటర్ టైన్మెంట్ పతాకం పై జ్యోతిక, సూర్య లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.