సూర్య అభిమానులకు ఇది సాడ్ న్యూస్ అని చెప్పాలి. మొదట టీజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడంతో అందరూ గర్వంగా ఫీల్ అయ్యారు. కానీ ఈ చిత్రం ఆస్కార్ 2022లో పాల్గొనలేక పోయింది. ఆస్కార్ రేసు నుంచి అవుట్ అయింది.
94వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 276 చిత్రాలలో జై భీమ్ కూడా ఒకటిగా నిలిచింది. మంగళవారం రాత్రి ఏడు గంటలకు జై భీమ్ గురించి బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందని ఎంతో మంది ఇండియన్స్ ఎదురుచూశారు.
అయితే దురదృష్టవశాత్తు ఆస్కార్ అవార్డుల నుండి జై భీమ్ అవుట్ అంటూ ప్రకటించారు. రైజింగ్ విత్ ఫైర్ ఉత్తమ డాక్యుమెంటరీ కేటగిరీలో ఈ చిత్రంను మొదట ఎంపిక చేశారు. ఇందులో 276 చిత్రాలు పోటీ పడగా అందులో పది మాత్రమే షార్ట్ లిస్టులో ఉన్నాయి.
ఇక నవంబర్ 2న ఓటిటి వేదిక రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.