మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. అయితే రెండు రోజుల పాట హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. వారిని వెనక్కి పంపేందుకు వాటర్ కెనాన్స్, షెల్స్ వంటి ప్రయోగించారు. లాఠీఛార్జ్ కూడా చేశారు. అయినప్పటికీ రైతులు వెన్నుచూపకుండా పోరాటం కొనసాగించి.. ఎట్టకేలకు ఢిల్లీలో అడుగుపెట్టేందుకు అనుమతి సాధించారు. అయితే రైతులపై ప్రభుత్వం ప్రవర్తించిన తీరును కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ తీవ్రంగా ఖండించారు.
రైతులపై లాఠీలతో విరుచుకుపడుతున్న ఫోటోలను షేర్ చేస్తూ..మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది చాలా విచారకరమైన ఫొటో. సాధారణంగా మనం జై జవాన్, జై కిసాన్ అని నినాదాలిస్తుంటాం. కానీ ఇప్పుడు మాత్రం మోదీ ప్రభుత్వం జవాన్లను, రైతులకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతోది. ఇది చాలా భయంకరయైన విషయం అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.