రేవంత్‌కు జైపాల్‌రెడ్డికి సెట్ అయ్యిందా?

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైపాల్‌రెడ్డి.. ఇటీవ‌ల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి బంధువులే అయినా వాళ్లద్దరి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేటంత వైరం ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే! ఐతే, గ‌తంలో వేరువేరు పార్టీల్లోవున్న ఈ నాయ‌కులిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో కొన‌సాగ‌డం సాధ్యమ‌వుతుందా? అన్నదే రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎన్ని విభేదాలున్నా పార్టీ కోసం రాజీప‌డ‌క‌త‌ప్పదు అంటున్నారు సీనియ‌ర్ నేత జైపాల్‌రెడ్డి. త‌న‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి కావాల్సిందిగా ఆఫ‌ర్ వ‌చ్చినా, తాను తిర‌స్కరించాన‌ని, ఇప్పుడు తెలంగాణాలో సీఎం కావాల‌న్న ఆశ త‌న‌కు లేద‌న్నారు జైపాల్‌రెడ్డి. 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కేంద్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించ‌డం ఖాయ‌మ‌ని, దీనికి ఎంతైనా బెట్ చేస్తాన‌ని ఆయన స‌వాల్ విసురుతున్నారు.