ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులను చూడాలనుకుంటున్నారా? అయితే మీరు జైపూర్ ‘డాల్ మ్యూజియం’ కు వెళ్లాల్సిందే…అన్ని దేశాల సంస్కృతులను ప్రతిబింబించే బొమ్మలను ఈ మ్యూజియంలో చూడొచ్చు! ఈ డాల్ మ్యూజియం జైపూర్ జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని సేథ్ ఆనందీ పాఠశాల ప్రాంగణంలో నిర్మించబడింది. ఈ మ్యూజియంలో దేశ విదేశాలకు చెందిన ప్రత్యేకతలను వివరించే బొమ్మలు ఉంచబడ్డాయి.ఈ మ్యూజియాన్ని 1973 లో సెక్సేరియా కుటుంబం స్థాపించింది.
ఈ మ్యూజియంలో జపాన్, అరేబియా, స్వీడన్, స్విట్జర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అమెరికా, యుకె దేశాలకు చెందిన సంస్కృతులను ప్రతిబింబించే బొమ్మలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే బొమ్మలు కూడా ఉన్నాయి.
రాజస్థాన్ తోలుబొమ్మలు ఈ మ్యూజియంలో ప్రత్యేకం! వీటిని చూడడం కోసం చాలా మంది విదేవీ పర్యాటకులు వస్తుంటారు. 2 అంగుళాల అతిచిన్న బొమ్మ ఇక్కడి మరో ప్రత్యేకం! రకరకాల కార్టూన్లు మరియు సూపర్ హీరో పాత్రల బొమ్మలు కూడా ఈ మ్యూజియంలో ఉంటాయి.!
ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఈమ్యూజియం తెరిచే ఉంటుంది. టికెట్ ధర భారతీయ పౌరులు 10 రూపాయలు, విదేశీయులకు 50 రూపాయలు.