జైరాం రమేష్. ఈ మధ్య ఈ పేరు కాస్త వినటం తగ్గినా… ఏపీ విభజన సమయంలో ప్రతి రోజు హెడ్‌లైన్‌లో ఉండేదే. ఆయనే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనీయర్ నేత జైరాం రమేష్. అమరావతి రాజధాని ఆందోళనలు, మూడు రాజధానుల అంశంపై జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందని చెబుతూనే… అసెంబ్లీ ఒకచోట, సచివాలయం ఒక చోట జరిగే పని కాదంటూ కొట్టి పారేశారు. ఇప్పుడున్న చోటనే రాజధాని కొనసాగించటం ఉత్తమమంటూ సలహా ఇచ్చారు జైరాం రమేష్.
గతంలో మద్రాసు నుండి రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా సాధ్యపడలేదని 1953లో కర్నూల్ రాజధానిగా ఉన్న సమయంలో గుంటూరులో హైకోర్టు సాధ్యపడలేదని ఆయన గుర్తు చేశారు.
ఓర్వేలేకే రాజధాని మార్పు: నారా లోకేష్
Advertisements