కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కి కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై మరోనేత జైరాం రమేష్ ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మంచిదే అంటూనే పరిహాసంగా ట్వీట్ చేశారు.‘‘ కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని అనుకోవడం సరైన నిర్ణయమే. కానీ.. అతను ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు తప్ప.. గులాంగా కాదు’’ అని వ్యాఖ్యానించారు.
దీంతోపాటు జైరాం బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారనే వార్తను కూడా జైరాం రమేష్ షేర్ చేశారు. అటు.. గులాం నబీ ఆజాద్‌కు పద్మ అవార్డు ప్రకటించడంపై శశిథరూర్ కూడా ట్వీట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘పద్మభూషణ్ అవార్డు పొందిన గులాంనబీ ఆజాద్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆజాద్ ప్రజాసేవకు అవతలి వైపు ప్రభుత్వం కూడా గుర్తింపునివ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని శశిథరూర్ ట్వీట్ చేశారు.
Right thing to do. He wants to be Azad not Ghulam. https://t.co/iMWF00S9Ib
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 25, 2022
Advertisements
కాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కి బీజేపీ గత కొంత కాలం నుంచి గాలం వేస్తుందనే వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా ఆజాద్ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సమయంలో ఆయనపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆజాద్ సేవలు వాడుకుంటామని చెప్పారు. దీంతో.. ఆయనను బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చలు జరిగాయి. మరోవైపు ఆజాద్ జమ్మూకశ్మీర్ లో కొత్త పార్టీ పెడుతున్నాడనే వార్తలు కూడా ఆ మధ్య చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ ట్వీట్ కి ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. విపక్ష నేతలు.. సీపీఎంకి చెందిన బుద్ధదేవ్ భట్టాచార్జీ, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌లు కూడా పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. కానీ.. బుద్ధదేవ్ భట్టాచార్య ఈ అవార్డుని తిరస్కరించారు.