ఆర్ఆర్ఆర్.. మూవీ కోసం సినీ అభిమానులు నాలుగేళ్లు వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్ల వద్ద దుమ్మురేపుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వెయ్యి కోట్ల వైపు పరుగెడుతున్న ఈ సినిమా రానున్న రోజులలో మరిన్ని రికార్డులు సాధిస్తుందని ఆశీస్తున్నారు చిత్ర బృందం. ఇక మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్ర బృందం సక్సెస్ పార్టీలు, వేడుకలు అన్ని జరుపుకున్నారు.
తాజాగా మరోసారి ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా ఈ సినిమాకు విదేశీ సినీ ప్రియుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 6న జరిగిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మూవీ డైరెక్టర్ రాజమౌళి మీడియాతో.. మూవీపై విదేశీ మీడియా రాతల, అక్కడి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు విదేశీ మీడియా నుంచి ప్రశంసలు పొందుతానని ఊహించలేదని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ సినిమాను ప్రశంసించటం చాలా సంతోషంగా ఉందన్నారు.
బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. బాహుబలి-2కి జపాన్ నుంచి ప్రశంసలు వచ్చాయని, ఆర్ఆర్ఆర్ సినిమాకి యూఎస్ నుంచి ఇంత ఆదరణ వస్తుందని ఊహించలేదన్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కంటే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవటం చాలా ముఖ్యం అని ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాను యూఎస్ ప్రేక్షకులు ఆదరించటం మనసును టచ్ చేసిందని అన్నారు. తనకి ఇది ఎంతో ప్రత్యేకం అని చెప్పారు.
Advertisements
‘బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. కానీ తేడా ఏంటంటే విదేశీ మీడియా మాత్రం ఆర్ఆర్ఆర్ గురించి రాస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కూడా మా సినిమా గురించి రాసింది. ముఖ్యంగా యూఎస్‌లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇది నాకు హార్ట్ టచింగ్ మ్యాటర్. బాహుబలి 2కి జపాన్ నుంచి ప్రశంసలు వస్తాయని, ఆర్‌ఆర్‌ఆర్‌కి యూఎస్ నుంచి ఆదరణ వస్తుందని ఊహించలేదు. బాక్సాఫీస్ నంబర్‌లు ముఖ్యమనే విషయాన్ని కాదనలేము.. కానీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు చాలా ముఖ్యమైనవవి. మనం చేయగలిగేది ప్రాజెక్ట్‌కి 100 శాతం ఇవ్వడం, చేయగలిగినంత ఉత్తమంగా చేయడం అని నేను ఎప్పుడూ చెప్తాను. అంకెలు మన చేతుల్లో లేవు, ప్రేక్షకులపై ఆధారపడి ఉంటాయి. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలను మాత్రమే మనం అంచనా వేయగలము” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.