ఏటా సంక్రాంతి వేళ తమిళనాడులో సంబురంగా సాగే జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. కరోనా మార్గదర్శకాలను దృష్టి పెట్టుకొని పలు నిబంధనల మధ్య నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తున్నారు. మధురై అవన్యపురంలోజల్లికట్టు జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు.. ఒక్కో ఈవెంట్‌లో 200కు పైగా ఎద్దులు జల్లికట్టు బరిలో ఉంచారు. అలాగే 150 మందికి మించి పోటీలో పాల్గొనరాదని ప్రభుత్వం నిబంధన విధించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే వీక్షకుల సంఖ్య కూడా మైదానంలో 50 శాతానికి మించకూడదని ప్రభుత్వ నిబంధన విధించింది.
#WATCH Tamil Nadu: #Jallikattu begins in Avaniyapuram of Madurai.
Over 200 bulls are participating in the competition. In the wake of #COVID19, State govt directed that number of players shouldn't be over 150 at an event. Number of spectators not more than 50% of the gathering. pic.twitter.com/VdVCLgPIon
— ANI (@ANI) January 14, 2021
ఇక అవన్యపురంలో ఉదయం నుంచే జోరుగా పోటీలు సాగుతుండగా.. ఎద్దులను బంధించేందుకు యువకులు పోటీపడుతున్నారు. కాగా ఇక్కడ నిర్వహించే వేడుకలను స్వయంగా వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నేడు వస్తున్నారు.