ఈవీవీ సత్యనారాయణ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పటి జనరేషన్ వారికి అంతగా తెలియక పోయినా అప్పటి జనరేషన్ వారికి ఈవీవీ సత్యనారాయణ గురించి బాగా తెలుసు.
అయితే కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈవీవీ సత్యనారాయణ జంబలకడిపంబ కథ రాసి ఓ పత్రికకు పంపించారట. వారు దానిని చూసి.. ఇది కూడా కథేనా అంటూ వెనక్కి పంపించారట. అప్పుడు ఈ కథతో సినిమా తీయాలని భావించాడట ఈవీవీ సత్యనారాయణ.
రాజమౌళి సినిమాలో ఉన్న కామన్ పాయింట్ ఎంత మంది గమనించారు ? ఇప్పుడు RRR లో కూడా ఉందా ???
అయితే ఈ కథ రాసేటప్పుడు హీరోగా రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారట ఈవీవీ సత్యనారాయణ. కానీ ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ బిజీగా ఉండటం వల్ల నరేష్ తో సినిమా చేశారు. అలాగే హీరోయిన్ విషయంలో చాలా మందిని ప్రయత్నించారు ఆఖరికి ఆమనిని సెలెక్ట్ చేశారు.
ఇక డి.వి.వి.దానయ్య, ఆచంట గోపీనాథ్ ఈ చిత్రాన్ని నిర్మించగా నెల రోజుల వ్యవధిలోనే షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. 1992 జూలై 12 న ఈ చిత్రం విడుదల అయింది. 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు కోట్లు వసూలు చేసింది.
ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి క్యాన్సల్ అయ్యేవరకు అంత జరిగిందా ?
ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో ఓ రికార్డ్ సృష్టించింది. ఆడవారు మగవారుగా… మగవారు ఆడవారు గా మారటం సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించింది.
ఈ సినిమాతో హీరోయిన్ ఆమనికి కూడా అవకాశాలు వచ్చాయి. విశేషం ఏంటంటే ఈ సినిమా 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.