బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ని బండబూతులు తిట్టింది హాలీవుడ్ నటి జమీలా జమీల్. అంతేకాకుండా తిట్ల దండకంతో తన ఇస్ స్టా హ్యాండిల్ లో పెద్ద వ్యాసాన్నే పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సామూహికంగా సమ్మె చేయకుండా రిషి సునాక్ అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సమ్మెలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాడని జమీలా మండిపడింది. దేశంలో ప్రజలకు సమ్మె చేసే స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నిస్తూ.. రాయలేని పదజాలాన్ని ఉపయోగించింది. బతకడానికి సరిపడా వేతనాలు లేని వాళ్లు సమ్మెకు దిగారని, కానీ ఈ సంపన్న నియంత వారిని అణిచివేస్తున్నాడని దుయ్యబట్టింది.
‘పే అండ్ ప్రొటెక్ట్ ద పీపుల్ హూ కీప్ యువర్ కంట్రీ ఫంక్షనింగ్ ఎ లివింగ్ వేజ్’ అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది . ఇంకా చాలా బూతులు తిట్టిన జమీలా.. చివరగా రిషి సునాక్ ఆటలు తాము సాగనివ్వబోమని హెచ్చరించింది.
కాగా జమీలా జమీల్ గతంలో తన రాబోయే సిరీస్ ‘షీ హల్క్: అటార్నీ ఎట్ లా’ సందర్భంగా వార్తల్లో నిలిచింది. ఆ సిరీస్ కోసం ప్రచురించిన ప్రొడక్షన్ ఫొటోలో ఆమె హెయిర్ స్టైల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు రిషి సునాక్ ను తిట్టి ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చింది.