నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా మరికొన్ని అద్భుతమైన ఫోటోలను తీసింది. ఈ టెలిస్కాప్ తాజాగా కార్ట్ వీల్ గెలాక్సీకి సంబంధించిన ఫోటోలు తీయగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.
దీన్నే శాస్త్రవేత్తలు జిమ్నాస్టిక్స్ చేసే గెలాక్సీ అని కూడా పిలుస్తుంటారు. ఇది భూ చక్రాన్ని అంటిస్తే ఎలా అయితే తిరుగుతుందో ఈ గెలాక్సీ కూడా అంతరిక్షంలో అదే మాదిరిగా తిరుగుతుంది.
ఇది మన భూ గ్రహానికి ఐదువందల మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఓ చిన్న పాలపుంతను, ఓ గెలాక్సీ ఢీ కొట్టడంతో ఇది ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సుమారు 440 మిలియన్ సంవత్సరాలు ఈ గెలాక్సీ విస్తరించి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందులో లోపల ఉన్న రింగ్ నుంచి రేడియంట్ ఎనర్జీ వస్తుంది.
దీని కారణంగా ఔటర్ రింగ్ విస్తరిస్తూ వెళుతూనే ఉంటుంది. దీని వల్ల ఈ ఔటర్ రింగ్ సమీపంలో సూపర్ నోవాలు, నక్షత్రాలు ఉద్భవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.