అయోధ్య స్థల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మొట్ట మొదటి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమాతె ఉలేమా-ఎ-హిందూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు తమకు రివ్యూ పిటిషన్ వేసుకునే హక్కు ఇచ్చినందున రివ్యూ పిటిషన్ వేస్తున్నట్టు జమాతె ఉలేమా-ఎ-హిందూకు చెందిన ముస్లిం మత పెద్ద మౌలానా అర్షద్ మదాని తెలిపారు.
ఈ కేసులో ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారనేదే ముఖ్య వివాదం అని.. అయితే ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పడం ముస్లింలకు టైటిల్ ఉందనే విషయాన్ని రుజువు చేస్తుందని…అయినప్పటికీ తుది తీర్పు మాత్రం దానికి భిన్నంగా ఇచ్చిందన్నారు.
అయోధ్యలోని స్థలం తమదంటే తమదని కొన్ని దశాబ్ధాలుగా హిందూ-ముస్లింల మధ్య వివాదం ఉంది. ఆ వివాదస్పద స్థలం హిందువులదే నంటూ నవంబర్ 9న నాటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.