జమ్ముకశ్మీర్‌లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సరిహద్దు ప్రాంతం పూంచ్ సెక్టార్ వద్ద భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. బాలాకోట్‌లో శనివారం రాత్రి భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
గ్రామంలో అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరికొందరు ఉగ్రవాదులు ఉండి వుంటారన్న అనుమానంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు ఇంకా గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మృతులకు ఇటీవల రాజౌరీ ఘటనకు సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. జనవరి 1న రాజౌరీ జిల్లాలోని దంగ్రీ గ్రామంపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు పౌరులు మరణించారు.
గతేడాది ఉగ్రవాదాన్ని కట్టడి చేయంలో చాలా వరకు సక్సెస్ అయ్యామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 90 ఆపరేషన్స్ నిర్వహించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇందులో 172 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయని పేర్కొన్నారు. 29 మంది సామాన్య ప్రజలు కూడా మరణించినట్టు వెల్లడించారు.