జమ్ము కశ్మీర్ లో కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్ ప్రజలకు ఉద్యోగాలు కావాలన్నారు. వారికి మంచి వ్యాపార అవకాశాలు కావాలని, వారు ప్రేమ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
కానీ వారికి వాటి బదులు బీజేపీ బుల్డోజర్ అందిస్తోందన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఆక్రమణలను 100 శాతం తొలగించాలని దేవాదాయ శాఖ కమిషనర్ సెక్రటరీ విజయ్ కుమార్ బిధూరి డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. దీంతో అధికారులు ఇప్పటివరకు 10 లక్షల కెనాల్స్ (ఒక కెనాల్ = 605 చదరపు గజాలు) భూమిని స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నో దశాబ్దాలుగా తమ కష్టార్జితంతో ప్రజలు సంపాదించుకున్న భూమిని వారి నుంచి లాక్కుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను విభజించకుండా ఏకం చేయడం ద్వారా మాత్రమే శాంతి, కాశ్మీరీలు పరిరక్షించ బడతారని పేర్కొన్నారను.
జమ్ములో కొనసాగుతున్న ఆక్రమణలను జమ్ము కశ్మీర్ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు దీనికి సంబంధించి పలు మీడియాల్లో వచ్చిన నివేదికలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.