కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగుతోంది. యాత్రలో ఈ రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. యాత్రలో ఈ రోజు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన కొంత దూరం పాదయాత్ర చేస్తారు.
ఒమర్ అబ్దుల్లా కూడా రాహుల్ గాంధీలాగా టీ షర్ట్ ధరించి యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొద్ది సేపటికే చలిగా అనిపించడంతో ఒమర్ అబ్దుల్లా జాకెట్ ధరించారు. భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో మరో మూడు రోజుల్లో ముగియనుంది.
ప్రస్తుతం కశ్మీర్‌లో ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఓ వైపు చలి వణికిస్తున్నా ఆయన ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని కాపీ కొట్టేందుకు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే ఒమర్ అబ్దుల్లా టీ షర్ట్ తో యాత్రకు హాజరయ్యారు. అయితే చలికి తట్టుకోలేక కొద్ది సేపటికే ఆయన జాకెట్ ధరించారు. రాంబన్ జిల్లాలోని బనిహాల్ రైల్వేస్టేషన్ నుంచి సుమారు 2 కి.మీ దూరం రాహుల్‌తో కలిసి ఒమర్ అబ్దుల్లా పాదయాత్ర చేశారు.