ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్, అక్కినేని ఆధిపత్యం ఉండేది అనే మాట వాస్తవం. వీళ్ళు ఇద్దరూ అంటే దాదాపుగా అందరూ గౌరవంగానే ఉండేవారు. వాళ్లకు దాదాపుగా అందరూ సన్నిహితంగానే ఉండేవారు. వారితో సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేసేవారు. కాని దివంగత నటి జమున మాత్రం వారి విషయంలో అలా వ్యవహరించలేదు. వారికి ఎదురెళ్ళే ప్రయత్నం చేసారు.
ఎన్టీఆర్ కంటే కూడా అక్కినేని విషయంలో కాస్త ఆమె సీరియస్ గా ఉండేవారట. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ కి అక్కినేని రాగా ఆయన వచ్చినా సరే లేవకుండా కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు జమున. దీనితో ఆయనకు కోపం వచ్చి అదే విషయాన్ని ఎన్టీఆర్ కు కూడా చెప్పారట. దీనితో తమ సినిమాల్లో ఆమెను తీసుకోవద్దు అని పట్టుబట్టారట.
అయితే ఆమెకు మంచి టాలెంట్ ఉండటంతో అగ్ర దర్శక నిర్మాతలు పక్కన పెట్టడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు అప్పట్లో. చివరికి ఆమెను గుండమ్మ కథ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆ వివాదం విషయంలో ఆమెతో క్షమాపణ లెటర్ రాయించాలి అని చూసినా సరే ఆమె రాయలేదు. సినిమాలు రాకపోయినా పరవాలేదని ధీమాగా ఉన్నారట జమున. ఒక సందర్భంలో ఎన్టీఆర్ అమాయకుడు అని అక్కినేని పెద్ద నాటకాల రాయుడు అని కామెంట్ చేసారు ఆమె.