తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ జమున ఇక లేరు. వయసు ప్రభావంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఆమె మృతి చెందారు. ఇప్పుడు ఆమె వయసు 86 ఏళ్ళు.
హైదరాబాద్‌లో జమున తుది శ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో సుమారు 198 చిత్రాల్లో జమున నటించారు. ఆమె ఆగస్టు 30, 1936లో హంపీలో జన్మించారు. ఆమె తల్లి తండ్రులది ప్రేమ వివాహం.
ఆమె తండ్రి నిప్పని శ్రీనివాసరావు మాధవ్ బ్రాహ్మిణ్ కాగా… తల్లి కౌసల్యా దేవి వైశ్యులు. జమునకు ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు హంపి నుంచి గుంటూరుకు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యింది.
దుగ్గిరాలలో ఆవిడ పెరిగారు. మహానటి సావిత్రి ఒకసారి దుగ్గిరాల వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఉన్నారు. సావిత్రి ఆహ్వానంతో జమున సినిమాల్లోకి వచ్చారు. గరికపాటి రాజారావు తీసిన ‘పుట్టిల్లు’ సినిమాతో జమున చిత్రసీమకు పరిచయం అయ్యారు. అయితే, ఎల్వీ ప్రసాద్ తీసిన ‘మిస్సమ్మ’తో ఆమెకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది.