ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై మరోసారి గళమెత్తారు జనసేనపార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ కు రహదారుల పరిస్థితి తెలిసే విధంగా కొత్త క్యాంపెయిన్ ను మొదలు పెట్టింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అంటూ జనసేన పార్టీ వైసీపీకి చురకలు అంటిస్తోంది.సీఎం జగన్ కు చేరుకునే విధంగా ##GoodMorningCMSir అంటూ డిజిటల్ క్యాంపెయిన్ ను చేపట్టారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ కార్యక్రమానికి మూడు రోజుల పాటూ శ్రీకారం చుట్టారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నాయని జనసేన వీడియోల ద్వారా తెలియజేస్తోంది. తాజాగా ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో భాగంగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఓ కార్టూన్‌తో కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా ఉందొ తెలియజేసేలా ఓ వ్యంగ్య చిత్రాన్ని ఇప్పటికే పోస్ట్ చేశారు. చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ హెలికాప్టర్లో వెళ్తున్నట్టు, సాధారణ జనం రోడ్లపై వెళ్తూ నరకం అనుభవిస్తున్నట్టు ఈ కార్టూన్లు ఉంటున్నాయి. తాజాగా వేసిన కార్టూన్ కూడా ఇలాగే హైలెట్ అవుతోంది.హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేయడంలో పవన్ ఫ్యాన్స్ ముందంజలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ దూసుకుపోతున్న గుడ్ మార్నింగ్ సీఎం సర్. అంతేకాదు జనసైనికులు, జనసేన కార్యకర్తలు అభిమానులు తమ సమీప ప్రాంతంలోని రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ.. ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేలా జనసేన పార్టీ సరికొత్త క్యాంపెయిన్ ను మొదలు పెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నెతలు, కార్యకర్తలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా రహదారి మధ్యలో పూల మొక్కలు వెలిశాయి. తమ ప్రాంతంలోని రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ జనసేన చేపట్టిన #గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ లో ఎక్కడికక్కడ రోడ్లను ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలో విజయవాడ భవానిపురం లోని ఊర్మిళ నగర్ లో గుంతలు పడి దెబ్బతిన్న రోడ్ల లో జనసేన నాయకులు వినూత్న రీతిలో పూల మొక్కలు నాటారు. రోడ్ల పరిస్థితిని వీడియో తీసి.. పూల మొక్కలు నాటి వినూత్నంగా డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్.
అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ భీమవరం నుంచే పోటీచేస్తారని జనసేన ప్రకటించింది. ఈ నెల 17 న భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు తెలిపారు. జనవాణి కార్యక్రమంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ అర్జీలు స్వీకరిస్తారించనున్నట్లు చెప్పారు. జనసేన అధినేత ను స్వయంగా కలసి ప్రజలు వారి సమస్యలను వివరించవచ్చని తెలిపారు.