నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనగామ జిల్లాలో RTA ఆఫీస్ నీట మునిగింది. నిబంధనలకు విరుద్ధంగా పెంబర్తి కంబాలకుంటలో ఆర్టీఏ ఆఫీస్ కట్టారని స్థానికులు చెబుతున్నారు.
వర్షా కాలం మొదలు అయితే ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది అని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనగామ కలెక్టరేట్ లోని సెల్లార్ లో వాటర్ లీకేజ్ అవుతోంది. మొన్నటి వానలకు బిల్డింగ్ లోని విద్యా, పంచాయతీ, లేబర్ ఆఫీసులో వాటర్ లీకేజ్ అవుతుండటంతో మరమ్మత్తులు చేపట్టారు.
అయితే నిన్న కురిసిన వర్షానికి కలెక్టరేట్ లోని సెల్లార్ లోని గోడల నుంచి వర్షపు నీరు వస్తోంది. నాసిరకం పనులతో గోడల నుంచి నీరు లీకవుతుందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పుడు అయినా అధికారులు స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు