సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి నీ చిత్రయూనిట్ ఎంపిక చేసింది..
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా ఓ జానపద గీతం ఉండనుందట. గతంలో ఖుషి, జానీ, పంజా, అత్తారింటికి దారేది, కాటమరాయుడు ఇలా పవన్ సినిమాలలో వైవిధ్యంగా కొన్ని పాటలు ఉండేవి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదేవిధంగా ఓ పాట ఉండనుందని సమాచారం.