చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. అనంతపురంలో ద్వారంపూడి వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరైందికాదంటూ హితవు పలికారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు బూతుపురాణం అందుకుంటూ ప్రజల్లో చులకన కావొద్దంటూ సూచించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆయనను అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో పోలీసులు వారిని ఆందోళన విరమించాలని సూచించారు. అయినప్పటికీ జనసేన నేతలు వినకపోవడంతో ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.