అసెంబ్లీ ఎన్నికలు గడిచి, కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం 6నెలలైనా గడవకముందే అప్పుడే జనసేన-బీజేపీల పొత్తు ఏపీ రాజకీయాల్లో సంచలనంగానే కనపడుతోంది. 2024 ఎన్నికలకు ఇప్పడి నుండే పొత్తేంటీ అన్న ప్రశ్న అందరినీ వేధిస్తున్నప్పటికీ… సీఎం అభ్యర్థి కూడా ఖరారైపోయినట్లు బీజేపీ వర్గాలు ప్రకటించటం హాట్ టాపిక్ అవుతోంది.
బీజేపీ-జనసేనల పొత్తు పొడవటమే ఆలస్యం… మా కూటమి 2024లో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతలు ధీమాగా ప్రకటించారు. అయితే ఏపీ బీజేపీ నేతలు పవన్ సీఎం అభ్యర్థిగా ఎలా అవుతారు అని వ్యాఖ్యానిస్తున్న ఈ పొత్తులో చక్రం తిప్పిన కర్ణాటక బీజేపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటూ ప్రకటించేస్తుkarnatన్నారు. బీజేపీతో జనసేన పొత్తులో కీలకంగా వ్యవహరించింది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక నేత సంతోష్ అని… పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రకటించారు.
అయితే దీనిపై స్థానిక నేతలు మాత్రం ఇంతవరకు పెదవి విప్పకపోయినా… ఎదో పెద్ద వ్యవహరమే నడిచిందని, లేదంటే ఏపీ బీజేపీ నేతలకు చివరి వరకు తెలియకుండానే పొత్తు వ్యవహరంపై చర్చలు నడిచాయని తెలుస్తోంది.