తుఫాను బాధితు రైతులకు పదివేల రూపాయల ఆర్థిక సాయం తక్షణం అందించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ దీక్ష చేపట్టారు. ఇటీవల తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించిన ఆయన.. నష్ట పరిహారంగా 35 వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ. 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పవన్ దీక్షకు దిగారు.
ఏపీలోని కలెక్టరేట్ల ఎదుట జనసేన శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టాయి. గుంటూరు కలెక్టరేట్ ఎదుట జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, పాకనాటి రమాదేవి, పలువురు పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు.