ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయం ఏపీ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది జగన్ సర్కార్. ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
పేరు మార్చి సాధించేది ఏమిటి?
* వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/IgmExcASLP
— JanaSena Party (@JanaSenaParty) September 21, 2022
ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ఆమోదం కూడా తీసుకుంది. మంత్రివర్గం అన్లైన్లోనే దీనికి ఆమోదం తెలిపింది. దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా ఎన్టీఆర్ పేరుతోనే ఈ యూనివర్సిటీ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం సడన్ గా ఈ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు మార్చాలని ప్రభుత్వంనిర్ణయించింది.
ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. పేరు మార్చి సాధించేది ఏమిటి? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు పవన్. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
పేరు మార్చాలి అనుకున్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం. కాబట్టి విశాఖ కేజీహెచ్ కు ఆ పేరు మార్చి.. వైద్య ప్రముఖలలో ఒకరి పేరు పెట్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోతాయా? అని ప్రశ్నించారు పవన్.