పవన్‌కల్యాణ్‌కు తొలిప్రేమ సినిమా ఎంతో, వేణుమాధవ్‌కూ అంతే. ఇద్దరూ ఈ సినిమాతోనే స్టార్‌డమ్ సంపాదించారు. పవన్‌కల్యాణ్-వేణుమాధవ్‌లది ప్రత్యేక అనుబంధం. పవన్‌కల్యాణ్ సినిమాలో అలీ ఎలా కంపల్సరీగా వుండేవాడో.. అంతే ప్రాధాన్యం వేణుమాధవ్‌కు కూడా ఉండేది. తొలిప్రేమ సినిమాలో వేణుమాధవ్ క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు అరకొర సినిమాలు చేతిలో ఉండగా, తొలిప్రేమ తర్వాత వేణుమాధవ్ రేంజ్ మారిపోయిందని చెప్తుంటారు ఆయన సన్నిహితులు.
తనతో కలిసి కెరియర్‌లో ఎదిగిన తన మిత్రుడు ఇక లేడని తెలిసి పవన్‌కల్యాణ్ ఎంతో విషాదానికి లోనయ్యారు. వేణుమాధవ్ మృతి వార్త తనను ఎంతో కలచివేస్తోందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ‘కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించటం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్‌లో అందరినీ సరదాగా ఉంచేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు పవన్.