పవన్‌కల్యాణ్ త్వరలో ఏదో బాంబు పేల్చబోతున్నారా? అధికార దుర్వినియోగంపై తాజాగా అతను చేసిన ట్వీట్ చూసినవాళ్లకి కలిగిన అనుమానం ఇది. అందులో ఎటువంటి వివరాలు లేవు. అధికార దుర్వినియోగం.. నిరంకుశ పాలన అనే మాటల్ని మాత్రమే వాడారు. అధికార దుర్వినియోగం ఏపీకి సంబంధించిన అంశంగా, నిరంకుశ పాలన తెలంగాణలో కేసీఆర్‌కు సంబంధించిన మేటర్‌గా పరిశీలకులు భావిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా.. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలసీల్లోని లోపాలను చెప్పడం, జనసేన కార్యక్రమాలను ప్రకటించడం, వివిధ పుస్తకాలను అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పరిచయం చేయడం ఆయన చేస్తుంటారు. తాజాగా ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత శామ్యుల్ జాన్సన్ చెప్పిన మాటలను ట్వీట్ చేశారు. ‘‘ఏ ప్రభుత్వమూ అధికారాన్ని ఎక్కువ రోజులు దుర్వినియోగపరచలేదు. ప్రజలు ఏమాత్రం దాన్ని సహించలేరు. నిరంకుశ పాలనను అంతంచేసే శక్తి మనుషుల సహజ స్వభావంలోనే అభివ్యక్తమవుతుంటుంది. ఏ ప్రభుత్వాన్నుంచైనా అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది’’ అన్న శామ్యూల్ మాటలను యథాతథంగా ట్వీట్ చేశారు.
ఐతే, పవన్ చేసిన ట్వీట్ ఎవరికి సంబంధించిన ట్వీట్ అయివుంటుందా అని ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఇది కచ్చితంగా ఏపీలో జగన్ సర్కారును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోందని, సొంత మనుషులకు, సొంత పత్రికలో పనిచేసిన వారికి విచ్చలవిడిగా పదవులు, సర్కారు కొలువులు కట్టబెడుతున్నారని ఇటీవలి కాలంలో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
ఇటు చూస్తే.. తెలంగాణలో తండ్రీ కొడుకుల నిరంకుశ పాలనపై కాంగ్రెస్, బీజేపీ చెరోవైపు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ఎవర్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారా అని జనం చర్చించుకుంటున్నారు. వోవరాల్‌గా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన అంశాల్నిఎండగట్టడంలో విఫలం అవుతుంటే, అసెంబ్లీలో ఒకే ఒక్క స్థానం వున్నప్పటికీ పవన్‌కల్యాణ్ ప్రజా వ్యతిరేక పాలనను చాలా గట్టిగా ఎదిరిస్తున్నారనే మాట పబ్లిక్‌లో వినిపిస్తోంది.
No Government power can be abused long.Mankind will not bear it….There is a remedy in human nature against tyranny, that will keep us safe under every form of Government.
– Samuel Johnson— Pawan Kalyan (@PawanKalyan) September 23, 2019