జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి చేరుకొని.. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన అమర సైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని అందజేయనున్నారు. గతంలోనే పవన్ అమర సైనిక కుటుంబాల కోసం కోటి రూపాయలను విరాళంగా అందజేస్తానని.. స్వయంగా తానే ఢిల్లీకి వెళ్లి సైనిక్ బోర్డు కార్యాలయంలో చెక్ ను అందజేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ హస్తినకు చేరుకున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనబోతున్నారు.