ఏపీ రాజకీయాలతో బిజీ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని చెప్పుకొచ్చారు పవన్. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తే మాట్లాడి కార్మికులకు న్యాయం జరిగే విదంగా ప్రయత్నిస్తాను అని ప్రకటించాడు. పవన్ సపోర్ట్ తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులకు సెంటిమెంట్ గా మారింది. నల్లమల లో యురేనియం తవ్వకాలను వెంటనే ఆపాలని పవన్ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టి తెలంగాణలో తన ఉనికిని చాటాడు. అయితే యురేనియం తవ్వకాలు ఆగటంలో పవన్ పాత్ర ఎంతో కొంత ఉండనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ కార్మికుల సమస్యల పై పవన్ గొంతు విప్పారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పవన్ కు అపాయింట్‌మెంట్ ఇస్తాడా లేదా అని చర్చనీయాంశంగా మారింది. పవన్ సపోర్ట్ ఉంటె ప్రజల్లోకి సమస్యను మరింత వేగంగా చేరువ చెయ్యొచ్చు అని తెలంగాణ నాయకులు కూడా బావిస్తున్నారంట.