ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని మరోసారి విడగొడతామంటే తోలు తీస్తాం.. మీకు మరో రాష్ట్రం కావాలా.. వేర్పాటు ధోరణితో ఉంటే నా అంతటి తీవ్రవాదిని చూడరన్నారు. ప్రజలను విడగొట్టింది ఇక చాలు ఆపేయండి అంటూ పవన్ హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడతామంటే మేము ఊరుకుంటామా..? పిచ్చి నాయకులు, ముసలి నాయకుల మాటలు పట్టించుకోకండి. కోడి కత్తులు గీసుకుంటే ఏపీ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటారు. 74వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా చెబుతున్నా.. రాష్ట్రాన్ని విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతామన్నారు.
తన వారాహి వాహనంపై జరుగుతున్న రచ్చతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనపై పవన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. వారాహి వాహనం ఏపీ రోడ్లపై ఎలా తిరుగుతుందో చూస్తామని వ్యాఖ్యానించారు. రోడ్డు మీదకు వస్తానంటే మిమ్మల్ని ఆపేస్తాం, తోసేస్తాం, కింద పడేస్తామన్నారు. ఈ రంగు కాదు, ఆ రంగు కాదని ఒక్కొక్కరూ పేట్రేగిపోయారంటూ వైసీపీ మంత్రులు, నేతల్ని ఉద్దేశించి విమర్శించారు. జీవో నంబర్ 1 వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తూ పవన్ సెటైర్లు సంధించారు.
అంతేకాదు జగన్ టీనేజ్ లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టిన ఘనత ఉందన్నారు. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ జగన్ చేతుల్లో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం మానవ హక్కులకు సంబంధించిన దాంట్లో ఉంటుందన్నారు. నేను సీఎం అయితే ఏంటి కాకుంటే ఏంటి? మీరు అనుకుంటే నేను సీఎం అవుతానని పవన్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఏమైపోతుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న చైతన్యం ఇక్కడ ఉంటే బాగుండేదన్నారు.
బాబాయిని చంపి సీబీఐకి కేసు అప్పగించుకోవడం.. కోడి కత్తితో పొడిపించుకుని తెలంగాణ వైద్యులు దగ్గరకు వెళ్లడం.. ఏపీ పోలీసులుపై నమ్మకం, గౌరవం లేదన్న వ్యక్తి.. ఇప్పుడు సీఎంగా పోలీసులు అందరూ శాల్యూట్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఐదు వేల జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. వాళ్ల నాన్న సీఎం.. అందుకే కోట్లు దోచుకున్నాడు.. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కోసం సంతకాలు చేయించాడు అంటూ సీఎం జగన్‌పై సూటిగా మాటల దాడి చేశారు జనసేనాని. ఇటువంటి వ్యక్తి ని నమ్మి ఓటు వేస్తే వారినీ మోసం చేశాడు.. నాతో సహా ఎవరికీ వ్యక్తి గత ఆరాధన గుడ్డిగా చేయకండని హితవు పలికారు పవన్ కళ్యాణ్.