జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని. ఆయన అయినట్టు ఎవ్వరు ముఖ్యమంత్రి అవ్వలేరన్నారు పవన్ కళ్యాణ్.గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం జనసేన నేతలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… పార్టీ పెట్టగానే ఎన్టీఆర్ లా అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాదని, ఆ నాటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్‌కే అలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమాజం స్వార్థం దారి పట్టిందని, ఉచితంగా అన్నీ అందిస్తాం అనే మాయ మాటలతో రాజకీయ నాయకులు యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు.
జనసేన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని అన్నారు. తాను దూర దృష్టితో జనసేన పార్టీ స్థాపించానని, రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందలేదని, తమ పార్టీపై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలు తమకు ఓట్లేశారని తెలిపారు.