తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై కార్మిక సంఘాలు తమను భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధం అని ప్రకటించిన నేపథ్యంలో… పెద్దలు, గౌరవనీయులు సీఎం చంద్రశేఖర్ రావు గారికి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు.
కార్మిక సంఘాల నేతలు విధుల్లోకి చేరేందుకు సిద్ధమని ప్రకటించినందున కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా వారిని చేర్చుకోవాలని కోరుతున్నాను అని ట్విట్టర్ వేదికగా కోరారు.
40రోజులకు పైగా సమ్మెలో ఉన్నవారే విధుల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున కుటంబ పెద్దగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. వారి సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలని కోరారు.