పవన్‌కు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. రాజధాని పర్యటనకు వచ్చిన పవన్ ను రాజధాని గ్రామాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజధాని మార్పుపై సీఎం జగన్ ప్రకటన చేసిన తరువాత రాజధాని రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తూ… రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు. జనసేన తరుపున పవన్ కూడా రాజధాని రైతులకు అండగా నిలిచేందుకు పర్యటన చేయాలనుకున్నారు.
కృష్ణయపాలెం నుంచి మందడం మీదుగా వెళ్తున్న పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద పవన్ అడ్డుకొని, సీఎం వెళ్లాకే గ్రామాల్లోకి వెళ్లాలని పవన్‌కు సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ వెంకటపాలెం చెక్ పోస్ట్ వద్ద బైఠాయించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.